
గతేడాది ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. ఒక్క సినిమాతోనే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తనదైన గ్లామర్‌తో ఆకట్టుకున్న ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ ఏడాది ముచ్చటగా మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. వాటిలో ముందుగా విడుదలయ్యేది ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. మరోవైపు హీరో రామ్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది భాగ్యశ్రీ. మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది.
త్వరలోనే మూవీ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. అలాగే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు జంటగా భాగ్యశ్రీ నటిస్తున్న చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 1950 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ వింటేజ్ లుక్‌లో కనువిందు చేయనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. అంటే ఈ ఏడాది తన నుంచి బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు విడుదలవడం లక్కీ చాన్స్ అనే చెప్పాలి. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టులకు భాగ్యశ్రీ కమిట్ అయినట్టు తెలుస్తోంది.