బాలీవుడ్లో ఒకే ఒక్క సినిమాతో కుర్రకారు కలల రాణిగా మారిపోయింది భాగ్యశ్రీ. సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘మైనే ప్యార్ కియా’ ఆమెకు మొదటి సినిమా. అదే చివరి సినిమా కూడా. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చింది. తాజాగా ఈ విషయంపై భాగ్యశ్రీ క్లారిటీ ఇచ్చింది.
ఆ సినిమా టైంలో సల్మాన్ తో తనకు ఎఫైర్ ఉందంటూ రూమర్లు స్ప్రెడ్ అవ్వడం తనను తీవ్రంగా బాధించిందని తెలిపింది. తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన టైంలో ఓ జర్నలిస్టు బొకేతో వచ్చి తనను కలిసినట్టు తెలిపింది.
‘మీ భార్యకు సల్మాన్‌తో సంబంధం ఉంది.. ఇప్పుడామె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మీరెలా ఫీలవుతున్నారు’ అని తన భర్తను అడిగాడని ఆ ఒక్క ప్రశ్నతో సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నట్టుగా వెల్లడించింది. ఇటీవల ‘రాధేశ్యాం’ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా ఈ సీనియర్ హీరోయిన్ నటించిన విషయం తెలిసిందే.