Bhagyashri Borse: తెలుగు మూవీకి డబ్బింగ్ చెప్పిన పూణె బ్యూటీ..

Bhagyashri Borse: తెలుగు మూవీకి డబ్బింగ్ చెప్పిన పూణె బ్యూటీ..

మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja) తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)  హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సితార,  రెప్పల్ డప్పుల్ సాంగ్స్ లో తనదైన అందంతో కనిపించి కుర్రాళ్ల హార్ట్లో క్రష్ గా మారిపోయింది.

తాజాగా మిస్టర్ బచ్చన్ లోని తన డబ్బింగ్ పార్ట్ ను భాగ్యశ్రీ బోర్సే కంప్లీట్ చేశారు. తన క్యారెక్టర్‌కు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని భాగ్యశ్రీ తన ఇంస్టాగ్రామ్ నుండి ఇట్స్ షో టైం..డబ్బింగ్ కంప్లీట్ అంటూ ఫోటో షేర్ చేసింది. కాగా..మహారాష్ట్రలోని పూణె నగరానికి చెందిన భాగ్యశ్రీ బోర్సే తెలుగు తన మాతృభాష కాకున్న కష్టపడి నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పడంతో టాలీవుడ్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది. సొంత భాష నటులే సాహసం చేయని వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో తెలుగు భాషను నేర్చుకుని, తన హక్కున చేర్చుకుని డబ్బింగ్ చెప్పడం గ్రేట్ అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో క్రేజీయెస్ట్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఇప్పటికే, విజయ్ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తోన్న మూవీలో భాగ్యశ్రీ బోర్సేనటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే న్యాచురల్ స్టార్ నాని ఇటీవల సుజీత్ డైరెక్షన్ లో తన 32వ సినిమాను మొదలుపెట్టేశాడు.ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్య శ్రీ బోర్సేని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కనుక బోర్సే ఫిక్స్ అయితే మాత్రం..ఈ అమ్మడు నక్క తోక తొక్కినట్లే అని సినీ సర్కిల్ లో వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే, యారియాన్ 2లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన హరీష్ శంకర్ రవితేజ పక్కన మిస్టర్ బచ్చన్ లో మాస్ రాజాకి జోడిగా ఫిక్స్ చేశాడు. ఈ మూడు సినిమాలు కనుక హిట్ అయితే..మరో కొత్త బ్యూటీ టాలీవుడ్ ని ఏలే అవకాశం ఉంది. అయితే,భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్‌ని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15 న రిలీజ్ కానుంది.

ఎవరీ భాగ్యశ్రీ బోర్సే..

పుణెకు చెందిన భాగ్యశ్రీ బోర్సే స్టార్ మోడల్‍గా ఫేమస్. క్యాట్బరీ సిల్క్ సహా కొన్ని యాడ్స్ చేశారు. ఈ అమ్మడు యారియాన్ 2 అనే బాలీవుడ్ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది.అంతేకాదు..భాగ్యశ్రీకి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.