Aha Thriller: ఆహా ఓటీటీలోకి లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Aha Thriller: ఆహా ఓటీటీలోకి లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కన్నడ స్టార్  శివ రాజ్‌‌‌‌‌‌‌‌ కుమార్ హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘భైరతి రణగల్’. ఇది ఆయన నటించిన ‘మఫ్తీ’కి ప్రీక్వెల్. నర్తన్ దర్శకత్వంలో గీతా శివరాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also Read :- గాయం తర్వాత.. గోల్డెన్ టెంపుల్లో రష్మిక మందన్న

2024 నవంబర్ 15న రిలీజై సంచలన విజయం సాధించిన ఈ మూవీ.. డిసెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, కేవలం కన్నడలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ తెలుగు ఓటీటీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ఈ యాక్షన్ మూవీ గురువారం (ఫిబ్రవరి 13) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. 

"ఒక గ్యాంగ్‌స్టర్ ఎప్పుడూ పుట్టలేదు, అతను తయారు చేయబడ్డాడు. ఫిబ్రవరి 13 నుండి ఆహాలో భైరతి రణగల్ వస్తున్నాడు.." అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన  కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీరియస్‌‌‌‌‌‌‌‌ ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్న శివరాజ్ కుమార్ ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా రూ.18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. బాక్సాఫీస్ దగ్గర రూ.24 కోట్లు సాధించింది.