శివరాత్రికి విడుదల సిద్ధంగా భైరవం

శివరాత్రికి విడుదల సిద్ధంగా భైరవం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్,  నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో  కె.కె. రాధామోహన్‌‌‌‌ నిర్మిస్తున్న చిత్రం ‘భైరవం’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి హీరోల ఫస్ట్ లుక్స్‌‌‌‌తో పాటు టీజర్  రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. తాజాగా  ఇందులోని థీమ్ సాంగ్‌‌‌‌ను  మహా శివరాత్రి శుభ సందర్భంగా  ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ డివోషనల్ సాంగ్‌‌‌‌ అందర్నీ ఆకట్టుకునేలా  ఉంటుందని మేకర్స్ చెప్పారు. 

ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ రాయగా, శంకర్ మహదేవన్ పాడటంతో పాటపై అంచనాలు పెరిగాయి. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన  సాయి శ్రీనివాస్ పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. త్రిశూలాలను చేత్తో పట్టుకుని  ఇంటెన్స్ లుక్‌‌‌‌లో ఉన్నాడు సాయి.  అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై  హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్న ఈ సినిమా  సమ్మర్‌‌‌‌‌‌‌‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.