Bhairavam Teaser: ముగ్గురు తెలుగు హీరోల "భైరవం" టీజర్ రిలీజ్... ఎలా ఉందంటే..?

Bhairavam Teaser: ముగ్గురు తెలుగు హీరోల "భైరవం" టీజర్ రిలీజ్... ఎలా ఉందంటే..?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ చిత్రం "భైరవం". ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరోలు  బెల్లంకొండ శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కలసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. అదితి శంకర్, కాయల్ ఆనంది, దివ్య పిళ్ళై  హీరోయిన్లుగా నటించారు. అజయ్, రాజా రవీంద్ర, శరత్ లోహితాశ్వ, సంపత్ రాజ్, సందీప్ రాజ్, వెన్నెల కిషోర్, జయసుధ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

సోమవారం ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. మొదటగా వారాహి అమ్మవారి టెంపుల్ ని చూపిస్తూ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫైట్ సీక్వెన్స్ తో జయసుధ బ్యాగ్రౌండ్ వాయిస్ తో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఇందులో "దూరంగా మృత్యువుని జయించిన కృష్ణుడిలా శంఖం పూరించుకుంటూ శ్రీనుగాడు వెళ్ళిపోతున్నాడనే డైలాగ్ సాయిశ్రీనివాస్ ఎలివేషన్ అదిరిపోయింది. ఆ తర్వాత శ్రీను గాడికోసం ప్రాణాలు ఇస్తా.. వాడి జోలికి వస్తే ప్రాణాలు తీస్తా అంటూ మంచు మనోజ్ చెప్పే డైలాగ్ మొత్తం టీజర్ కే హైలెట్ గ నిలిచింది. అయితే ఇందులో హీరోలకి తప్ప మిగతా నటీనటులకు పెద్దగా డైలాగ్స్ లేవు. ఇక చివరగా రామ లక్ష్మణులకి నేనున్నానంటూ సాయి శ్రీనివాస్ చెప్పే డైలాగ్ తో టీజర్ ఎండ్ అవుతుంది.

ఇందులో ఎక్కువగా డైరెక్టర్ హీరోల ఎలివేషన్స్ మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మైథలాజికల్ టచ్, యాక్షన్ సీక్వెన్స్  తో అలరించడానికి చేసిన ప్రయత్నం వర్కౌట్ అయ్యిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మేకింగ్, ఫైట్స్ కంపోజింగ్, బీజియం వంటి విషయాల్లో డైరెక్టర్ పని తీరు స్పష్టంగా తెలుస్తోంది. మరి టీజర్ తో ఆకట్టుకున్న డైరెక్టర్ విజయ్ కనకమేడల థియేటర్స్ లో ఏ విధంగా అలరిస్తాడో చూడాలి.