బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘భైరవం’. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్. సోమవారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. హీరోల పాత్రలను చూపిస్తూ సాగిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘చాలా గ్యాప్ తర్వాత వస్తున్నా. ఈసారి మంచి కథా బలం ఉన్న సినిమాతో రావాలని బలంగా నిర్ణయించుకున్నా.
అలా ‘భైరవం’ లాంటి మంచి కథ దొరికింది. ఇందులో మనోజ్, నారా రోహిత్ పాత్రలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. మా మధ్య వచ్చే సన్నివేశాలు అందరికీ నచ్చుతాయి. ఈ సినిమా మాకు మంచి పేరు తీసుకొచ్చి మమ్మల్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని కోరుకుంటున్నా’ అని అన్నాడు. ఇది జస్ట్ టీజర్ మాత్రమేనని, ట్రైలర్ అదిరిపోతుందని, సినిమా దుమ్ము లేచిపోతుందని మనోజ్ చెప్పాడు. తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని క్యారెక్టర్ చేశానని, తమకు మోస్ట్ మెమొరబుల్ మూవీ అని నారా రోహిత్ చెప్పాడు. విజయ్ కనకమేడల మాట్లాడుతూ ‘ఈ సినిమా మాస్, యాక్షన్ ఆడియెన్స్‌కి పండుగలా ఉంటుంది. ముగ్గురు హీరోలతో కలిసి పని చేయడం ఎక్సయిటింగ్‌గా అనిపించింది. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాత రాధా మోహన్ చెప్పారు. హీరోయిన్ అతిది శంకర్, నటుడు సందీప్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల తదితరులు పాల్గొన్నారు.