
- స్విగ్గీ ఫుడ్ ఆర్డర్లో రెస్టారెంట్ యజమానికి వినియోగదారుడి విజ్ఞప్తి
- ఉల్లిగడ్డల ధరలు పెరిగాయంటూ ఆవేదన
న్యూ ఢిల్లీ: ‘భయ్యా తోడా ప్యాజ్ డాలో’.. ఈ డైలాగ్ మనకు ప్రతి పానీపూరి బండి దగ్గర వినిపిస్తుంది. అయితే, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తి కూడా అచ్చం ఇలాంటి డైలాగ్‌నే వాడి, అందరి దృష్టిని ఆకర్షించాడు. తనకు రౌండ్‌గా కట్ చేసిన ఉల్లిగడ్డలు తప్పనిసరిగా పంపాలని రిక్వెస్ట్ చేశాడు. ఉల్లిగడ్డల ధర పెరిగిందని, తాను వాటిని కొనలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘దయచేసి కొన్ని ఉల్లిగడ్డలు పంపండి అన్నా’’ అంటూ అభ్యర్థించాడు.
ఈ రిక్వెస్ట్‌ను అతడి ఫ్లాట్మేట్ స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టగా, వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై స్విగ్గీ కో ఫౌండర్ ఫణి కిషన్ అడ్డెపల్లి స్పందించారు. స్విగ్గీ ఇన్స్టామార్ట్వినియోగదారులకు ఆశ్చర్యకరమైన ఆఫర్ ప్రకటించారు.
ఢిల్లీ ఎన్సీఆర్పరిధిలో కిలో రూ.70–రూ.80 ధర పలుకుతుండగా.. స్విగ్గీ ఇన్ స్టామార్ట్లో రాత్రి 7–8 గంటల వరకు రూ. 39కే కిలో ఉల్లిగడ్డలను అందిస్తున్నట్టు ప్రకటించారు. స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఫణి కిషన్ వెల్లడించారు.