అద్దంకి  దయాకర్​పై చర్యలు తీసుకోవాలి

దేవరకొండ,  వెలుగు : హిందూ దేవతలను ఉద్దేశించి అసభ్యంగా  మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని, అద్దంకి దయాకర్ పై   చర్యలు తీసుకోవాలని భజరంగ్​ దళ్​ జిల్లా కన్వీనర్​  సంపత్ డిమాండ్​ చేశారు.  బుధవారం దేవరకొండ పట్టణంలో  రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్   దిష్టి బొమ్మల  దహనం చేశారు.  అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు.   కాంగ్రెస్  సభల్లో ఒకరితర్వాత ఒకరు  హిందూ దేవుళ్లను దూషించడం సరికాదన్నారు.  ఎన్ని కుట్రలు చేసినా దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితిలో లేదని  చెప్పారు.