మార్చి 2న భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తం : అలేఖ్య పుంజాల

మార్చి 2న భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తం : అలేఖ్య పుంజాల
  • రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ అలేఖ్య పుంజాల అన్నారు. సీఎం సూచనల మేరకు భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతి కళాభవన్‌‌‌‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

మార్చి 2న హైదరాబాద్ లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 26 సంగీత గాన బృందాలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని, 600 మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొంటున్నారని వివరించారు. ఈ ఉత్సవాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభిస్తారని తెలిపారు.