ఏడాదిన్నర క్రితం ‘భామా కలాపం’ అనే వెబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి అందర్నీ ఆకట్టుకుంది ప్రియమణి. ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ సమర్పణలో అభిమన్యు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆహా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా సెకెండ్ పార్ట్‌కు ప్లాన్ చేసిన మేకర్స్.. ఈ సారి థియేటర్స్‌లోనూ రిలీజ్ చేస్తున్నారు. గురువారం ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ప్రియమణి, శరణ్య ప్రదీప్ లీడ్ రోల్స్‌లో దీన్ని రూపొందిస్తున్నారు.
అనుపమ పాత్రలో ప్రియమణి అమాయక ఇల్లాలుగా కనిపిస్తుండగా, తనకు అసిస్టెంట్‌గా శరణ్య నటిస్తోంది. వీరిద్దరూ కలిసి ఓ దోపిడీకి రెడీ అయినట్టు ఇందులో చూపించారు. ‘ది మోస్ట్ డేంజరస్ హౌస్ వైఫ్’ అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తిని పెంచుతోంది. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, అనుజ్ గుర్‌వార్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు.