న్యూఢిల్లీ : ఇండియా టెన్నిస్ ప్లేయర్ యూకీ భాంబ్రీ ఆక్లాండ్‌లో జరుగుతున్న ఏఎస్‌బీ క్లాసిక్ టెన్నిస్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. బుధవారం జరిగిన మెన్స్ డబుల్స్ ప్రి క్వార్టర్స్‌లో యూకీ, ఫ్రాన్స్‌కు చెందిన అల్బనో ఒలీవెటీ 6–4, 6–4తో సాండర్ అరెండ్స్ (నెదర్లాండ్స్)–లూక్ జాన్సన్ (బ్రిటన్)పై వరుస సెట్లలో విజయం సాధించి ముందంజ వేశారు.
కానీ, అడిలైడ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో శ్రీరామ్ బాలాజీ నిరాశపరిచాడు. మెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో బాలాజీ–మిగ్వేల్ రెయెస్ (మెక్సికో) 3–6, 6–3, 11–13తో నాలుగో సీడ్స్ హారి హెలియవార (ఫిన్లాండ్)–హెన్రీ పాటెన్ (బ్రిటన్) చేతిలో పోరాడి ఓడిపోయారు.