మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్కు బెయిల్

మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్కు బెయిల్

హైదరాబాద్: మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్కు బెయిల్ మంజూరైంది. సీఐడీ ఆమ్స్ యాక్ట్  కేసులో బెయిల్ లభించింది. అయినప్పటికీ జీవిత ఖైదు కేసులో భాను జైల్లోనే ఉండనున్నాడు. సూరి హత్య కేసులో భాను కిరణ్కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

భాను కిరణ్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. 12 సంవత్సరాలుగా భాను కిరణ్ జైల్లో ఉంటున్నాడు. జీవిత ఖైదు కేసులో భాను కిరణ్ సుప్రీంను ఆశ్రయించాడు. స్థానిక కోర్టులో తేల్చుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జీవిత ఖైదు కేసు‌ ఈ నెల 11న (నవంబర్ 11, 2024) విచారణకు రానుంది.

2011 జనవరి 4న భాను కిరణ్ చేతిలో మద్దెలచెరువు సూరి హత్యకు గురయ్యాడు. పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి ప్రధాన నిందితుడు. హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ నవోదయ కాలనీలో భాను కిరణ్ సూరిని కాల్చి చంపేశాడు. అనంతపురం ఫ్యాక్షన్ చరిత్రలో అప్పట్లో ఈ పరిణామం సంచలనం రేకెత్తించింది. పరిటాల రవి, మద్దెలచెరువు సూరి, మొద్దు శీను, ఓం ప్రకాశ్, భాను కిరణ్.. అనంతపురం రక్త చరిత్ర గురించి తెలిసిన వారికి ఈ పేర్లు సుపరిచితమే.