నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లా వెలుగు ఫొటోగ్రాఫర్ భానుతేజ ఉత్తమ ఫొటోగ్రఫీ విభాగంలో రాష్ట్ర స్థాయి కన్సోలేషన్ ఫ్రైజ్ అందుకున్నారు. అగ్రికల్చర్ థీమ్‌పై ఆయన తీసిన ఫొటోకు బహుమతి దక్కింది.
ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రోగ్రామ్‌లో స్టేట్‌ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్‌రావు చేతుల మీదుగా అభినందన పత్రం అందుకున్నారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీఎం ఆఫీస్ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.