ఏపీలో 3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండి

ఏపీలో 3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండి

ఏపీలో 3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండని ఫైర్ అయ్యారు సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అమరావతిపై ఇప్పటికే 7వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. రాజధాని మారిస్తే నష్టం ప్రజలకే కదా అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక సమస్య తెచ్చిపెడుతున్నాయన్నారు. అసెంబ్లీలో నేతల తీరు చూస్తే తెలుగు వాళ్లమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోందన్నారు.