జులై 4న విద్యా సంస్థల భారత్‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌ : బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌

జులై 4న విద్యా సంస్థల భారత్‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌ : బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌
  •     విద్యార్థి, యువజన సంఘాల పిలుపు
  •     పేపర్‌‌‌‌‌‌‌‌ లీకేజీలపై ప్రధాని ఎందుకు స్పందించట్లేదు: బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు : నీట్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ లీకేజీకి నిరసనగా ఈ నెల 4న విద్యా సంస్థల భారత్‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నట్లు.. అందుకూ ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ, ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు. నీట్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ లీకేజీపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. గత పదేండ్లలో 70 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని..దీనివల్ల దేశ ప్రతిష్ట మసకబారుతున్నదని ఆరోపించారు. మంగళవారం నాంపల్లిలోని టీజేఏస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఐక్య విద్యార్థి, యువ జన సంఘాల మీడియా సమావేశం జరిగింది.  

ఈ మీటింగ్ లో ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, డీవైఎఫ్ఐ,  ఎస్ఎఫ్ఐ, పీవైఎల్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. " మోదీ పాలనలో పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీలు సర్వసాధారణం అయ్యాయి. పోటీ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విఫలం అయ్యింది. ఈ విషయాలపై దేశ ప్రధాని మౌనంగా ఎందుకు ఉన్నారు. దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ లీకేజీపై నిర్లక్ష్య పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిబట్టి చూస్తే పేపర్ లీకేజీలకు బీజేపీ నేతలే కారణమని అనుమానాలు వస్తున్నాయి. ఎగ్జామ్ ల నిర్వాహణలో లోపాలను నిరసిస్తూ ఈ నెల 4న విద్యా సంస్థల భారత్ బంద్ నిర్వహిస్తున్నాం.

బంద్‌‌‌‌‌‌‌‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా" అని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. నీట్ సమస్యపై సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని  యువ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలీమ్ పాష ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మౌనం వీడాలని కోరుతూ 4న భారత్ బంద్ కి పిలుపునిస్తున్నామని చెప్పారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ కోరారు. రాష్ట్రాలకే నీట్ పరీక్ష నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి రిక్సెస్ట్ చేశారు.