తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఈసారి అధ్యక్ష పదవికోసం ఠాగూర్ మధు, భరత్ భూషణ్ లు పోటీపడ్డారు. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. మరోవైపు ఉపాధ్యక్ష పదవికి అశోక్‌కుమార్, వైవీఎస్ చౌదరి పోటీ పడగా అశోక్ కుమార్ విజయం సాధించారు.
అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకుంటారు. ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో సెక్టార్‌లోని సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్నాయి. బైలా ప్రకారం దిల్ రాజ్ పదవికాలం ముగిసింది. కాగా.. ప్రతీ రెండేళ్లకోసారి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతాయి.
గతేడాది నిర్మాతల సెక్టార్ నుంచి పోటీ ఉండగా.. సి.కల్యాణ్ ప్యానల్ పై దిల్ రాజు 17 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడి ఎన్నికలు జరిగాయి.