హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో కరెంటు బిల్లు చెల్లింపులను సరళీకృతం చేసేందుకు, ఎన్పీసీఐ భారత్ బిల్‌పే లిమిటెడ్ (ఎన్బీబీఎల్)... ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్), సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్)లను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్ ) ప్లాట్‌ఫారమ్‌లో తీసుకువచ్చింది.
దీనివల్ల రెండు రాష్ట్రాల్లోని వినియోగదారులు ఇప్పుడు వందలాది బ్యాంకులు, ఫిన్‌టెక్ యాప్‌లు, వెబ్సైట్లతో సహా ఏదైనా బీబీపీఎస్ -ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తమ కరెంటు బిల్లులను కట్టవచ్చు.