భారత్ బయోటెక్ నుంచి కలరా వ్యాక్సిన్‌‌‌‌

భారత్ బయోటెక్ నుంచి కలరా వ్యాక్సిన్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు : భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మంగళవారం   నావెల్​ సింగిల్ స్ట్రెయిన్ ఓరల్ కలరా వ్యాక్సిన్‌‌‌‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. హిల్‌‌‌‌కోల్ పేరుతో దీనిని అమ్మనున్నట్టు ప్రకటించింది. కలరాను ఎదుర్కోవడానికి దీనిని హిల్‌‌‌‌మాన్ లాబొరేటరీస్ లైసెన్స్‌‌‌‌తో తాము అభివృద్ధి చేశామని భారత్ బయోటెక్  ప్రకటించింది.  ఓరల్ కలరా వ్యాక్సిన్‌‌‌‌లకు గ్లోబల్ డిమాండ్ సంవత్సరానికి 10 కోట్ల డోస్‌‌‌‌లు దాటిందని తెలిపింది. 

హైదరాబాద్,  భువనేశ్వర్‌‌‌‌ ప్లాంట్లలో 20 కోట్ల డోస్‌‌‌‌ల వరకు తయారు చేస్తామని పేర్కొంది. ఈ వ్యాక్సిన్​ సురక్షితమని మూడోదశ ట్రయల్స్​ నిర్ధారించాయని ప్రకటించింది. హిల్​కోల్​ను సింగిల్​ డోసులో ఇస్తారు. ఏడాదిపైగా వయసున్న వారంతా దీనిని తీసుకోవచ్చు. మనదేశంలో బెంగాల్​లో కలరా ఎక్కువగా ఉంది.