
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) 63 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ, బీకాం, బీబీఎం, పదోతరగతి పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు : మొత్తం 63 పోస్టుల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ (కంప్యూటర్ సైన్స్)-10, సివిల్-6; టెక్నీషియన్ సి (ఎలక్ట్రానిక్ మెకానిక్)-27, ఫిట్టర్-12, ఎలక్ట్రికల్-3, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)-2; జూనియర్ అసిస్టెంట్-3 ఉన్నాయి. అన్ని పోస్టులకూ గరిష్ట వయసు 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
అర్హతలు : ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుకు సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేయాలి. ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల శిక్షణ ఉంటుంది. ట్రైనింగ్‌లో నెలకు రూ.10,000 స్టైపెండ్ చెల్లిస్తారు. టెక్నీషియన్- సి పోస్టులకు పదోతరగతితోపాటు ఐటీఐ పాసవ్వాలి. ఏడాది అప్రెంటిస్ ట్రెయినింగ్ పూర్తిచేయాలి. సంబంధిత విభాగంలో నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకు మూడేళ్ల బీకామ్/ బీబీఎం పాసవ్వాలి.
సెలెక్షన్ : అర్హతల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి.. రాతపరీక్షను నిర్వహిస్తారు. దరఖాస్తులు సెప్టెంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.bel-india.in వెబ్సైట్లో సంప్రదించాలి.