
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తాత్కాలిక ప్రాతిపదికన 55 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత : సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు జనవరి 1, 2024 నాటికి ట్రైనీ ఇంజినీర్‌కు 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 32 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు : ఆఫ్‌లైన్ దరఖాస్తులను మేనేజర్ (హెచ్‌ఆర్), ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రొఫెసర్ యూఆర్ రావు రోడ్, నాగాలాండ్ సర్కిల్ దగ్గర, జాలహళ్లి పోస్ట్, బెంగళూరు అడ్రస్‌కు ఫిబ్రవరి 14 లోపు పంపించాలి.