పాట్నా: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్ లోని ప్రవేశించింది. అక్కడ రాహుల్ గాంధీకి కాంగ్రెస్పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దేశాన్ని విడదీసేందుకు బీజేపీ,ఆర్ఎస్ఎస్ద్వేషాన్ని వ్యాప్తిచేస్తుంటే.. తాము ప్రేమను పంచుతున్నం.
మణిపూర్లో ఇప్పటికీ హింస చెలరేగుతోంది. కానీ ఇప్పటివరకు ప్రధాని మోదీ అక్కడికి ఎందుకు వెళ్లడం లేదు? ఎన్డీయేపాలనలో ప్రజలకు న్యాయం జరగడంలేదు. బడా వ్యాపారులకు మేలు. దేశంలో ఆర్థిక, సామాజిక న్యాయం పునరుద్ధరించాలి. మణిపూర్హింసకు ప్రధానిదే బాధ్యత’ అని అన్నారు.