మార్నింగ్ వాకర్స్ తో రాహుల్ రన్నింగ్

మార్నింగ్ వాకర్స్ తో రాహుల్ రన్నింగ్

మహబూబ్ నగర్ జిల్లాలో 5వ రోజు రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. జడ్చర్ల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. గొల్లపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర రాజాపూర్, బాలానగర్ మీదుగా.. అన్నారం గేట్, షాద్ నగర్ వరకు కొనసాగనుంది భారత్ జోడో యాత్ర. బాలానగర్ జంక్షన్ దగ్గరున్న అయ్యప్పస్వామి టెంపుల్ దగ్గర మార్నింగ్ బ్రేక్ ఇవ్వనున్నారు. సాయంత్రం 4గంటలకు బాలానగర్ జంక్షన్ దగ్గర నుంచి తిరిగి యాత్ర ప్రారంభం కానుంది. ఏడు గంటలకు షాద్ నగర్ బైపాస్ దగ్గరున్న అన్నారం గేట్ వద్ద రాహుల్ మాట్లాడనున్నారు. షాద్ నగర్ దగ్గరున్న ఫరూక్ నగర్ లో నైట్ హాల్ట్ ఏర్పాటు చేశారు. మొత్తం 22 కిలోమీటర్లు సాగనుంది రాహుల్ యాత్ర. 


రాహుల్ పాదయాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్.. మాణిక్కం ఠాగూర్,  భట్టి విక్రమార్క మధుయాష్కి, ఎంపీ ఉత్తమ్ దంపతులు, వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. మార్నింగ్ వాకర్స్ తో కలిసి రన్నింగ్ చేశారు రాహుల్. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇవాళ రంగారెడ్డి జిల్లాలోకి భారత్ జోడో యాత్ర ఎంటర్ కానుంది. దీంతో.. రాహుల్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

శనివారం 20.3 కిలోమీటర్లు నడిచారు. మహబూబ్ నగర్ టౌన్ నుంచి జడ్చర్లలోని రాజాపూర్ వరకు పాదయాత్ర కొనసాగింది. భారత్ జోడో యాత్రలో భాగంగా జడ్చర్లలో నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసే పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజల ఉసురు పోసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన నల్లచట్టాలకు సీఎం కేసీఆర్ మద్దతిచ్చారని తెలిపారు.