
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో న్యూరల్ ఏఐ గవర్నెన్స్ సమ్మిట్ 2025ను భారత్ లైట్‌హౌస్ (బీఎల్‌హెచ్) నిర్వహించింది. ప్రజా పరిపాలనను న్యూరల్ ఏఐ గవర్నెన్స్ ఎలా మార్చగలదు? అనే అంశంపై ఈ సమ్మిట్‌లో చర్చించారు.
ప్రభుత్వ అధికారులు, ఏఐ ఎక్స్‌పర్ట్‌లు, వ్యాపారవేత్తలు ఇందులో పాల్గొన్నారు. భారత్ లైట్‌హౌస్ సీఈఓ మోహన్ కుమార్ కేఆర్, కోఫౌండర్ దీప్తి గనుగపెంట ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. న్యూరల్ ఏఐ గవర్నెన్స్‌తో ప్రభుత్వ కార్యకలాపాలను మరింత సమర్ధవంతంగా, పారదర్శకతతో నిర్వహించొచ్చని మోహన్ అన్నారు. డేటా భద్రతపై ఫోకస్ పెట్టామన్నారు.