ఆటో డ్రైవర్లకు ముద్రలోన్లు మంజూరు చేయాలి

జోగిపేట, వెలుగు: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ముద్రలోన్లు​మంజూరు చేయాలని భారత్ ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్​మజ్దూర్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి డిమాండ్​చేశారు. శుక్రవారం జోగిపేటలో బస్టాండ్​ ముందు  భారత్ మజ్దూర్ సంఘ్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల తెలంగాణలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయన్నారు. 

అనేక మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక బాధలు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.  బ్యాంకుల ద్వారా ముద్ర లోన్ సౌకర్యం కల్పించి ప్రైవేట్ ఫైనాన్సర్ల నుంచి కాపాడాలన్నారు. కార్యక్రమంలో మొగులయ్య, ఎండీ హాబీబ్, శ్రీధర్ రెడ్డి, నరసింహ రెడ్డి, మోహన్ రెడ్డి, శంకర్, బాబుల్, జాఫర్, తాజ్ భాయ్, ఆబెద్, విజయ్, సత్యనారాయణ, రవీందర్, వాహెద్, గోవర్ధన్, రవి పాల్గొన్నారు.