
హైదరాబాద్, వెలుగు: భారత్ సమ్మిట్ తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పుకునేందుకే కాకుండా, అనేక విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడిందని డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన భారత్ సమ్మిట్ కు వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన భారత్ సమ్మిట్ కు డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజలే కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, అణగారిన, పేద వర్గాల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.