
గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. 1996లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ గా వస్తోన్న లేటెస్ట్ భారతీయుడు 2 మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ ఫిల్మ్గా తెరకెక్కిస్తున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్,సిద్ధార్థ్,రకుల్‌ప్రీత్ సింగ్,బాబీ సింహా,సముద్రఖని తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తుంది. దీంతో ఇండియాన్ టీమ్ టికెట్ల రేటు పెంచుకోవడనికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా తాజాగా స్పందించింది.
భారతీయుడు 2 సినిమాకి తెలంగాణ సర్కార్ స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు వచ్చాయి. దీంతో తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.50 మరియు జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లలో రూ.75 మరియు జీఎస్టీకు టికెట్ ధరలు పెరిగాయి. అలాగే ఉదయాన్నే మరో అదనపు షో వేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. అయితే ఏపీ సర్కార్ టికెట్ రేట్లు ఎలా పెంచబోతున్నారు అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.
#Bharateeyudu2 - #Telangana Government gives facility on Ticket Hikes (₹75 hike for multiplexes & ₹50 hike for single screens for first 7 days).
— Vidya Sagar (@VidyaSagarPU) July 10, 2024
Five shows per day.#Indian2 #KamalHaasan #Siddharth #RakulPreetSingh pic.twitter.com/LawVAvP8UG
ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవాలంటే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేయాలని సినిమా ఇండస్ట్రీని ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ మేరకు హీరో హీరోయిన్లతో,డైరెక్టర్స్ తో వీడియోలు రిలీజ్ చేయించాలని కోరారు.అందులో భాగంగా ఈ సినిమాలో నటించిన హీరో కమల్ హాసన్, సిద్ధార్థ, డైరెక్టర్ శంకర్,సముద్ర ఖని డ్రగ్స్ వినియోగం తప్పంటూ వీడియో రిలీజ్ చేశారు.ఈ నేపథ్యంలో తొలిరోజే ఈ సినిమా దాదాపు రూ.150 కోట్లకు పైనే రాబట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.