కంటోన్మెంట్, వెలుగు : బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళామహోత్సవం సందడిగా సాగుతోంది. నాలుగో రోజైన బుధవారం 15 వేల మంది సందర్శకులు వచ్చారు. గాంధీ జయంతిని సందర్భంగా పరిసరాల పరిశుభ్రత
వ్యర్థాల నిర్వహణపై నేచుర్ఆర్బిట్కలెక్టివ్ ఫౌండేషన్ ప్రతినిధులు అవగాహన కల్పించారు. సాయంత్రం నిర్వహించిన కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.