బొల్లారంలో ముగిసిన కళామహోత్సవ్

బొల్లారంలో  ముగిసిన కళామహోత్సవ్

కంటోన్మెంట్, వెలుగు: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్​ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బ్రిటీష్​డిప్యూటీ హైకమిషనర్ గారెత్​విన్​ఓవెన్, మేజర్​జనరల్​రాకేశ్​మనోచా,  జీఓసీ  54వ ఇన్​ఫాంటీ డివిజన్​ లెఫ్టినెంట్​కల్నల్​పీకే శర్మ, రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి పట్టాభిరామారావు, కల్నల్​ జుబిన్​ పౌల్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. 

8 రోజులుగా సాగిన  ఉత్సవాలకు లక్షల మంది హాజరు కాగా, ఆదివారం ఒక్కరోజే 20 వేల మంది హాజరైనట్లు రాష్ట్రపతి నిలయం మేనేజర్ ​రజనీ ప్రియ తెలిపారు.  నార్త్ ​ఈస్ట్​ జోన్ డైరెక్టర్ ప్రసన్న గొగోయ్​ను ఇండియన్​ఎక్స్​లెన్సీ అవార్డుతో సత్కరించారు.