సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసే దాకా పోరాడతాం : కొండెల సాయిరెడ్డి

సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసే దాకా పోరాడతాం : కొండెల సాయిరెడ్డి
  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలి
  • భారతీయ కిసాన్​ సంఘ్ ​జాతీయ అధ్యక్షుడు సాయిరెడ్డి

నిజామాబాద్, వెలుగు:  పదేండ్ల కింద మూసేసిన సారంగాపూర్​కో– ఆపరేటివ్​షుగర్​ఫ్యాక్టరీని(ఎన్సీఎస్​ఎఫ్​) రీ ఓపెన్ ​చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో  మాటిచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం హామీని నెరవేర్చాలని భారతీయ కిసాన్​ సంఘ్​ జాతీయ అధ్యక్షుడు కొండెల సాయిరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రీ ఓపెన్​ చేసేదాకా పోరాడుతామని పేర్కొన్నారు. మంగళవారం కిసాన్​సంఘ్​వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ సిటీలోని మారుతీనగర్​గణేశ్​భవన్​లో నిర్వహించిన ప్రోగ్రామ్ లో ఆయన మాట్లాడారు.

పంట మార్పిడితో రైతులను చెరుకు సాగు వైపు మళ్లించి లాభాల బాట పట్టేలా చేయొచ్చన్నారు. తద్వారా వెయ్యి మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్​విభాగ్​ప్రచారక్​నర్రా వెంకటశివకుమార్​, కిసాన్​సంఘ్​ప్రతినిధులు కె.నారాయణరెడ్డి, గడ్డం దశరథ్​రెడ్డి, రైతు ఉత్పత్తిదారుల సంఘం స్టేట్​జనరల్​సెక్రటరీ డి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.