పాల ప్యాకెట్లతో ఫ్యాబ్రిక్, పౌచ్ లు, ఫోల్డర్లు..భారతీయ విద్యా భవన్​స్టూడెంట్స్​ వినూత్న ఆలోచన 

పాల ప్యాకెట్లతో ఫ్యాబ్రిక్, పౌచ్ లు, ఫోల్డర్లు..భారతీయ విద్యా భవన్​స్టూడెంట్స్​ వినూత్న ఆలోచన 
  • అభినందించిన బల్దియా కమిషనర్​ ఇలంబరితి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘సిప్, సేవ్, స్టైల్’ పేరుతో భారతీయ విద్యా భవన్, ఆత్మకూరి రామారావు స్కూల్ స్టూడెంట్లు వినూత్న ప్రాజెక్టు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవలో భాగంగా పాల ప్యాకెట్ల కవర్లనుగట్టి ఫ్యాబ్రిక్‌‌‌‌‌‌‌‌లా మార్చి, బ్యాగులు, పెన్సిల్ పౌచ్‌‌‌‌‌‌‌‌లు, ఫోల్డర్లు తయారు చేస్తున్నారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో కమిషనర్ ఇలంబరితిని కలిసి తమ ప్రాజెక్ట్ గురించి వివరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిరుపేదలకు ఆహార పంపిణీకి వినియోగించినట్టు చెప్పారు. కమిషనర్ ఇలంబరితి స్టూడెంట్ల సృజనాత్మకతను అభినందించారు.