
ఎలన్మస్క్ ఇండియాలోకి ఎంట్రీ అయిపోయాడు..మొన్నటికి మొన్న టెస్లా కార్లు.. ఇప్పుడు స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు. శాటిలైట్ల నుంచి నేరుగా ఇంటర్నెట్ సేవలు అందించే స్టార్లింక్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. ఇండియాలో ఎయిర్ టెల్తో కలిసి పని చేయటానికి ఒప్పందం కూడా చేసుకున్నారు.
భారతదేశంలో స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు బిలియనీర్ ఎలోన్ మస్క్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌తో భారతీ ఎయిర్‌టెల్ టైఅప్ అయినట్లు ప్రకటించింది. ఇదే విషయంపై మార్చి 11న స్పేస్ ఎక్స్, భారతీ ఎయిర్టెల్ ఓ సంయుక్త ప్రకటన చేశారు. భారతదేశంలో స్టార్‌లింక్ మొట్టమొదటి అధికారిక ఒప్పందం. అయితే దేశంలో స్టార్‌లింక్ సేవలను విక్రయించడానికి SpaceX నియంత్రణ ఆమోదాలకు లోబడి ఉంటుంది.
భారతదేశంలోని కస్టమర్లకు స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు స్పెస్ఎక్స్, భారతీ ఎయిర్‌టెల్తో ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ఇండియాలో ఎలాన్ మస్క్ మొదటి ఒప్పందం.ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేయడం ఓ ముఖ్యమైన మైలురాయి. ఇది తరువాతి జనరేషన్ కి శాటిలైట్ కనెక్టివిటీకి అందించేందుకు మా నిబద్ధతకు నిదర్శనం అని భారతీ ఎయిర్ టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు.
ఇటీవల టెస్లా కార్ల షోరూం ఏర్పాటుకు ముంబైలో ఓ స్థలాన్ని లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే..కార్లతోనే ఎలాన్మస్క్ ఇండియాలో అడుగు పెడతారని అనుకున్నారంతా.. అయితే భారతీ ఎయిర్టెల్తో ఒప్పందం.. ఇండియాలో స్లార్లింక్ శాటిలైజ్ కనెక్టివిటితో ఎలాన్మస్క్ అడుగు పెడుతున్నారు. ఒప్పందం తర్వాత కనెక్టివిటే తదుపరి.