![ఫైర్‌ఫ్లైలో వాటాలు అమ్ముతున్న ఎయిర్‌టెల్, వీ](https://static.v6velugu.com/uploads/2023/11/bharti-airtel-vodafone-idea-v-inked-deals-to-sell-singapore-company-manipura-digital-infrastructure-to-opco_UENzpQc5FA.jpg)
న్యూఢిల్లీ: వైఫై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్‌లు అందించే ఫైర్‌ఫ్లై నెట్‌వర్క్స్‌లో తమ వాటాలను సింగపూర్ కంపెనీ మనిపుర డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఓపీసీఓకు అమ్మేందుకు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీ) లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ వాటా అమ్మకం ద్వారా ఈ రెండు కంపెనీలు రూ.6.05 కోట్ల చొప్పున అందుకుంటాయి. 45 రోజుల్లోపు డీల్ పూర్తవుతుంది.
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కలిసి 2014 లో జాయింట్ వెంచర్ కంపెనీ ఫైర్‌ఫ్లైని ఏర్పాటు చేశాయి. టెలికం ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వాడుకునేలా అగ్రిగేట్ నెట్‌వర్క్‌ను ఫైర్‌ఫ్లై ఏర్పాటు చేస్తోంది. తమ వాటాలను అమ్మాక కూడా ఈ వైఫై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి కస్టమర్లుగా కొనసాగుతామని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రకటించాయి.