
హైదరాబాద్, వెలుగు: హై బిజ్ టీవీ బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ 2వ ఎడిషన్లో బెస్ట్ బ్రాండింగ్ అండ్ అడ్వేర్టైజింగ్ టీం అఫ్ ది ఇయర్ అవార్డును భారతి సిమెంట్ గెల్చుకుంది. కార్యక్రమంలో టీమ్ సభ్యులు విజయ్ కుమార్, పవన్ కుమార్ పాల్గొన్నారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రకాల వ్యాపారాల్లో రాణిస్తున్న సంస్థలు, వ్యక్తులకు హై బిజ్ టీవీ బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డులను అందజేశారు. 60కి పైగా పురస్కారాలు అందులో ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకు
ఈ కార్యక్రమంలో భాగంగా... రియల్టీ సెక్టార్‌లో విశేష సేవలు అందిస్తున్న సంస్థలకు, వ్యక్తులకు పురస్కారాలను ఇచ్చారు. 40కి పైగా అవార్డులను అందజేయగా, 12 మందికి లెజెండ్ పురస్కారం దక్కింది.
ఈ సందర్భంగా నటుడు, నిర్మాత, పొలిటీషియన్ మురళీమోహన్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి హై బిజ్ టీవీ అవార్డులను ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. భారతదేశం గర్వించదగ్గ నిర్మాణాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయని మురళీ మోహన్ తెలిపారు.
నగరంలో ఒకప్పుడు అంతర్జాతీయ సంస్థలకు నిర్మాణ కాంట్రాక్టులు ఇచ్చేవారని, ఇప్పుడు స్థానిక సంస్థలే ప్రాజెక్టులను చేపడుతున్నాయని చెప్పారు. మరో రెండేళ్లలో 100 ఫ్లోర్ల భవనాలు నిర్మితమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.