19 వరకే కొత్త ఓటర్ల నమోదు : భారతి లక్పతినాయక్

19 వరకే కొత్త ఓటర్ల నమోదు : భారతి లక్పతినాయక్
  •    ఎలక్టోరల్​ అబ్జర్వర్ భారతి లక్పతినాయక్

వనపర్తి, వెలుగు : వచ్చే ఎన్నికల్లో ఓటు  వేయా లంటే  ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎలక్టోరల్​ అబ్జర్వర్ భారతి లక్పతినాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో పాటు ఆయా మండలాల తహసీల్ధార్లు, ఆల్ పార్టీ లీడర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  మండల కేంద్రాలలో, మున్సిపాలిటీలలో బీఎల్ వో లు ఓటర్ల నమోదు, తొలగింపు విషయంలో పక్కా సమాచారం పెట్టుకోవాలన్నారు.

ఆయా రాజకీయ పార్టీల నాయకులు తీసుకువచ్చే బల్క్ ఓటర్ల నమోదును అనుమతించవద్దని సూచించారు. అనంతరం వనపర్తిలోని పలు పోలింగ్ బూత్ లలో ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తిరుపతి రావు,  ఆర్డీఓ పద్మావతి,  తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఓటరు నమోదు అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆఫీసర్లను కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి  రవి నాయక్ ఆదేశించారు.    గురువారం ఆయన  మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల ఈఆర్వోలు, ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలాల వారీగా వచ్చిన అప్లికేషన్ల వివరాలు తెలుసుకున్నారు. 15న ఎలక్టోరల్​అబ్జర్వర్ భారతి లక్పతినాయక్ ఓటరు జాబితాపై పార్టీల లీడర్లు, అధికారులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారుర. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్ రావు, స్పెషల్  కలెక్టర్ నటరాజ్,  
తదితరులు ఉన్నారు.