వర్థన్నపేట, వెలుగు : పట్టణ కేంద్రంలోని భారతీయ నాటక కళా సమితి స్వర్ణో త్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వర్థన్నపే ట బస్టాండ్ నుంచి కళాసమితి ప్రాంగణం వరకు కళాజాత నిర్వహించారు. నాటిక కళా సమితి సభ్యులు, కళాకారులు, స్థానికులు ఈ కళాజాతలో పాల్గొన్నారు. 50వ రాష్ట్రస్థాయి నాటిక పోటీల సందర్భంగా ప్రత్యేక సావనీర్ ను రూపొందించారు.
తొలి రోజు 2 నాటికలు ప్రదర్శించారు. కళానికేతన్ కళా పరిషత్-వీరన్నపాలెం వారి రాజుగారి గోచీ, తెలుగు కళా సమితి-విశాఖపట్నం వారి నిశ్శబ్ద మా నీ ఖరీదెంత నాటికలు ప్రేక్షకులను అలరించాయి. జిల్లాకు చెందిన ప్రముఖులు, కళాభిమానులు, కళాకారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.