బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గంగాపూర్‌లో కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ మాజీ ప్రధాన కార్యదర్శి బందారం క్రాంతి సోదరుడు భాస్కర్అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలసుకున్న డీసీసీ ప్రెసిడెంట్కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను ఫోన్‌ద్వారా పరామర్శించారు.
తక్షణ సాయం కింద రూ.10 వేలు పంపించగా, మండలాధ్యక్షుడు నూకల బాల్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయనవెంట మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎండీ మసూద్, గ్రామ అధ్యక్షుడు నర్సింహులు, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.