బెల్లంపల్లి రూరల్, వెలుగు: తాండూర్ మండలంలోని రేచిని గ్రామ పంచాయతీ ప్రజలకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు మహీదర్గౌడ్, రేచిని శక్తి కేంద్రం ఇన్చార్జ్ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో తాండూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పులుగం తిరుపతి, హరీశ్ గౌడ్, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ సంతోష్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీకృష్ణదేవరాయలు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ, బీజేపీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు కోడి రమేశ్ సంఘీభావం ప్రకటించారు.
ALSO READ: నల్గొండ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య టికెట్లు, వర్గ పోరు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేచిని గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేసుకుంటే రూ.15 లక్షలు ఇస్తానని, గ్రామ పంచాయతీలో రోడ్లు, తాగు నీటి సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు. దొంగుల్ చెరువు మత్తడికి రిపేర్లు చేయిస్తానన్న హామీని మరిచారని ఫైర్అయ్యారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి విష్ణు కల్యాణ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్, సీనియర్ నాయకులు శేషగిరి, మల్లేశ్, రాహుల్, రేచిని పోలింగ్ బూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.