ఇదివరకెప్పుడూ చూడని డిటెక్టివ్ స్టోరీ

ఇదివరకెప్పుడూ చూడని డిటెక్టివ్ స్టోరీ

శివ కందుకూరి హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. రాశీసింగ్ హీరోయిన్. పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా శివ కందుకూరి మాట్లాడుతూ ‘డిటెక్టివ్ సినిమాలు అనగానే తెలుగులో చంటబ్బాయ్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాలు గుర్తొస్తాయి. కానీ ఇదివరకెప్పుడూ మనం చూడని అంశాలతో తీసిన డిటెక్టివ్ సినిమా మాది.  దిష్టి బొమ్మను  మనం చూస్తుంటాం.

కానీ దాని గురించి అంతగా పట్టించుకోం. అయితే దీని గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. దానిని డిటెక్టివ్‌‌‌‌ స్టోరీకి అద్భుతంగా జోడించాడు దర్శకుడు. ఈ కథ కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల మధ్య ఉండే ఫారెస్ట్ టౌన్ నేపథ్యంలో జరుగుతుంది. అందుకే డిటెక్టివ్ పాత్రని కూడా అక్కడ ఉన్న  సహజసిద్దమైన పాత్రలానే డిజైన్ చేశారు. ఇందులో లవ్‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కథలో భాగంగానే ఉంటాయి.

వీఎఫ్ఎక్స్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. ఇప్పుడు మైథాలజీ థ్రిల్లర్ జానర్స్‌‌‌‌‌‌‌‌ను ప్రేక్షకులు ఎక్కువ ఆదరిస్తున్నారు. గీతా ఆర్ట్స్ విడుదల చేస్తుండటం హ్యాపీ. ఇక నా కొత్త సినిమాల విషయానికొస్తే.. శర్వానంద్ సినిమాలో సెకండ్ లీడ్‌‌‌‌‌‌‌‌గా నటించాను. ప్రమోద్ అనే కొత్త దర్శకుడితో  ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నా. మరో రెండు సినిమాలు లైన్‌‌లో ఉన్నాయి’ అని చెప్పాడు.