యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంఈవోగా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావుని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయగా మార్చి 16వ తేదీ శనివారం రోజున ఆయన బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఆయనను డిప్టేషన్ పైన ఈవోగా నియమించారు. యాదగిరిగుట్ట ఆలయానికి మొదటిసారిగా అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి నియామకం కావడం విశేషం.
యాదాద్రి ఆలయంపైన భాస్కరరావుకు పూర్తిస్థాయి అవగాహన ఉండడంతో ప్రభుత్వం ఆయన నియమించింది. అంతకుముందు ఉన్న ఈవో రామకృష్ణ రావు పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రలు యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా రామకృష్ణ ప్రొటోకాల్ పాటించలేదన్న ఆరోపణలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆయన్ను బదిలీ చేసింది.