పార్టీకోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు గుర్తింపు.. దానికి ఇదే నిదర్శనం: భట్టి విక్రమార్క

పార్టీకోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు గుర్తింపు.. దానికి ఇదే నిదర్శనం: భట్టి విక్రమార్క

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతీ కార్యకర్తకు హైకమాండ్ నుంచి మంచి గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. అందుకు ఉదాహరణ మహేశ్ కుమార్ TPCC పదవి దక్కడమే అని తెలిపారు. పీసీసీ పదవి బీసీ వ్యక్తికి ఇవ్వడం చాలా గర్వకారణంగా ఉందని భట్టి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని మహేశ్ కుమార్ గౌడ్ మరింత బలోపేతం సూచించారు. రాష్ట్రంలో లక్షలాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ముందుకు నడిపించాలని కోరారు. 

Also Read :- TPCC బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్

గతంలో పది సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని, కేసులు పెట్టారని వాటంన్నిటీ తట్టుకొని కష్టపడి పార్టీకోసం పని చేశారని ఆయన వివరించారు. అనేక పోరాటాలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఒకటో తారీక జీతాలు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ప్రజలు బొందపెట్టారు. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు ఇస్తున్నాం.. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కోసం మహేశ్ చాలా కష్టపడ్డాడని.. ఆయనకు పీసీసీ పదవి దక్కడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏ సంబంధం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. రాజీకీయంగా లబ్ది పొందడానికే హోం మంత్రి అమిత్ షా ఏవో ప్రకటనలు చేసి.. సెప్టెంబర్ 17 హైదరాబాద్ లో సభలు పెడుతున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948 సెప్టెంబర్ లో హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేశారిని ఆయన అన్నారు. ఆ టైంలో బీజేపీ పార్టీ లేదని.. సెప్టెంబర్ 17తో బీజేపీకి సంబంధం లేదని ఉత్తమ్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడటంలో కూడా కాంగ్రెస్ పార్టీయే ప్రధాన పాత్ర పోషించిందని వివరించారు. 
​​​​​