రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దాదాపు రెండు గంటల పాటు చదివారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ మొదలవ్వగానే ప్రారంభమైన బడ్జెట్ స్పీచ్‌లో గత ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర సర్కార్ పాలసీలను భట్టి హైలెట్ చేశారు. అయితే భట్టి గత ప్రభుత్వానికి సంబంధించి ఏమి ప్రస్తావించినా బీఆర్ఎస్ సభ్యులు అడ్డుతగులుతూ వచ్చారు.
బోగస్ అంటూ గట్టిగా అరుస్తు స్పీచ్‌కు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. స్పీకర్ వారించినా వినలేదు. అదే సమయంలో ప్రభుత్వ పాలసీలను ప్రకటిస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరిచారు. బడ్జెట్ స్పీచ్ మొదలైన రెండు నిమిషాలకు మాజీ సీఎం కేసీఆర్ మొదటిసారి సభలోకి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల సీట్లు అసెంబ్లీలో మారాయి.