ఇవాళ నిర్మల్​కు భట్టి విక్రమార్క రాక

నిర్మల్, వెలుగు: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం నిర్మల్ కు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ తుది దశ ఎన్నికల ప్రచారానికి సంబంధించి వ్యూహ రచనపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ లో జరిగే ఈ సమావేశానికి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు.