రోగాల రాష్ట్రంగా తెలంగాణ: భట్టి విక్రమార్క

రోగాల రాష్ట్రంగా తెలంగాణ: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ఆరోగ్య శాఖపై రివ్యూ చేయాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రోగాలతో జనం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. హాస్పిటల్స్ లో సౌకర్యాలు, శుభ్రత కరువయ్యాయన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం మాఫియా చేతుల్లో నడుస్తున్నాయని ఆరోపించారు భట్టి విక్రమార్క. ఈ నెల 19 నుంచి రాష్ట్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పర్యటిస్తానని తెలిపారు.