చనిపోయిన స్టూడెంట్ తండ్రికి నష్టపరిహారం, జాబ్​ ఇవ్వాలి: భట్టి విక్రమార్క డిమాండ్

కూసుమంచి/ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం జిల్లా పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో కరెంట్​షాక్​తో మృతి చెందిన స్టూడెంట్​హలావత్ దుర్గా నాగేందర్ కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం అందజేయడంతోపాటు, బాలుడి తండ్రికి ఉద్యోగం కల్పించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​చేశారు. ఆదివారం ఆయన కూసుమంచి మండలం పాలేరులోని నవోదయ స్కూల్​ను సందర్శించారు. స్టూడెంట్​ఫొటోకు నివాళి అర్పించి, నవోదయ స్కూల్​హైదరాబాద్ రీజనల్​అసిస్టెంట్ కమిషనర్ అబిజీత్ బేరతో మాట్లాడారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కరెంట్​షాక్​ఘటనపై జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్, నవోదయ సమితి అధికారులతో మాట్లాడతామన్నారు. పేద గిరిజన విద్యార్థి మృతి చెందడం బాధకరం అన్నారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు  దుర్గాప్రసాద్, లీడర్లు రాయల నాగేశ్వరరావు, గువరయ్య, కిరణ్, అంతోటి వెంకన్న ఉన్నారు. 

అలాగే అమరావతి - నాగ్​పూర్, -దేవరపల్లి - ఖమ్మం నేషనల్​హైవేల విస్తరణతో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి భట్టి విక్రమార్క ఆదివారం వందనం-, కోదుమూరు వద్ద హైవే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ నష్టపరిహారం ఇస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. గ్రామాల సమీపంలో అండర్ పాస్ లు, సర్వీస్​రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు.