దొరల ప్రభుత్వాన్ని దించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో శనివారం(నవంబర్ 5) లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1360 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని మ్యానిఫెస్టోలో పొందు పరిచామని ఆయన తెలిపారు.
మధిర నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉందని.. నియోజకవర్గానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చానని చెప్పారు. ప్రభుత్వంతో పోరాడితేనే మధిర నియోజకవర్గానికి దళిత బంధు వచ్చిందని భట్టి తెలిపారు. ప్రజల తెలంగాణ రావాలంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే సాధ్యమవుతుందని.. మధిర నియోజకవర్గ ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు.
ALSO READ :- కేసీఆర్ ఎలక్షన్ కమిషన్ను కూడా మోసం చేసిండు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్