కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దమే: భట్టి విక్రమార్క ఫైర్

మాజీ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమాక్క తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే.. అబద్దాలే మాట్లాడుతారని ఆయన ఫైరయ్యారు. అబద్దాల పునాదులపై ఏర్పడిన పార్టీ..బీఆర్ఎస్ అని అన్నారు. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థితోపాటు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేసీఆర్ చెప్పే అబద్దాలు అసహ్యంచుకునే...  వాళ్లను బండకేసి కొట్టి మరీ  తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని అన్నారు. అబద్దాలతో, కట్టు కథలతో ఈ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ సంపదను, వనరులను ప్రజలకు చెందకుండా తన సన్నిహితులకు మోదీ కట్టబెడుతున్నారని మండిపడ్డారు.

Also Read:బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే... చర్చకు ఎక్కడికైనా సిద్ధం

దేశ సంపదను ప్రధాని మోదీ, రాష్ట్ర సందను కేసీఆర్ ఈ పదేళ్లలో దోచేశారని భట్టీ ఆరోపించారు. మరోసారి బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపి సంపదను దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఒక వైపు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే బీజేపీ, -మోదీ ఒకవైపు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, దేశ సందను ప్రజలకు పంచాలనే రాహుల్ గాంధీ మరోవైపు అని చెప్పారు. రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన.. ఖమ్మం అభ్యర్తి రామసహాయం రఘురామిరెడ్డికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భట్టీ కోరారు.