
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో శనివారం ఆయన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే బాధ్యతలను సీఎం రేవంత్ ఈ ఇద్దరు నేతలకే అప్పగించారు.
రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు నియోజకవర్గాల పునర్విభజనపై ఒకే తాటిపైకి రావాల్సిన అవసరాన్ని గుర్తుచేసేందుకు... త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్ ద్వారా చర్చించాల్సిన ప్రధాన అంశాలపై జానారెడ్డి, భట్టి మాట్లాడుకున్నారు.