పాలేరు ఎమ్మెల్యేపై సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కందాల ఉపేందర్ గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉందన్నారు. పాలేరు ప్రజలు ఇలాంటి వ్యక్తికా ఓట్లేసి గెలిపించామని సిగ్గుపడ్తున్నారని చెప్పారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం కార్నర్ మీటింగ్ లో భట్టి విక్రమార్క మండిపడ్డారు.
కాంగ్రెస్ కార్యకర్తల ఓట్లతో గెలిచి, వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుబోయారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలకు ఎం చేశారని ప్రజల మధ్య తిరగబుద్ది అవుతదని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును దోపిడి చేస్తున్న వారికి బుద్ది చెప్తారన్నారు. సామాన్య ప్రజలపై దాడులు చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న నాయకులకు అలవాటుగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు.