- రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న భట్టి
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలోని విద్యుత్ రంగ సమస్యలను కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ దృష్టికి డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తీసుకెళ్లారు. మంగళవారం ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది.
దీనికి రాష్ట్రం తరఫున భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ ముషరఫ్ ఫరూఖి హాజరయ్యారు. అనంతరం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన వివిధ విద్యుత్ సమస్యలపై చర్చించారు.